News August 7, 2024

విజయనగరంలో ముగిసిన అవగాహన సదస్సు

image

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిర్వహించిన మూడు రోజుల అవగాహన సదస్సు బుధవారంతో ముగిశాయి. పరిశ్రమల స్థాపనకు రాయతీ రుణాలు ఎలా పొందాలో జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ వంశీ మోహన్ అవగాహన కల్పించారు. లోన్లు ఎలా పొందాలో కెనరా బ్యాంకు ప్రతినిధి ప్రభాకర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గోవిందరావు పాల్గొన్నారు.

Similar News

News October 7, 2024

పైడిమాంబ ఉత్సవాలు.. ఓం బిర్లాకు ఆహ్వానం

image

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో సోమవారం కలిశారు. విజయనగరంలో ఈనెల 13, 14, 15వ తేదీల్లో జరగనున్న శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు.

News October 7, 2024

విజయనగరంలో వాలంటీర్ల నిరసన

image

విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.