News March 8, 2025
విజయనిర్మల మన నరసరావుపేట వాసి

విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. ఆమె తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరు ఉండేవారు. విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించి, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థానానికి చేరారు. ఆమె, కృష్ణ కలిసి జంటగా సుమారు 50 వరకూ చిత్రాలలో నటించారు. ఆమె ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినందుకు గిన్నిస్ బుక్‌లో ఎక్కారు.
Similar News
News December 14, 2025
ఉపసర్పంచ్‌ను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అదే రోజు లేదా మరుసటి రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై చేతులు పైకెత్తే విధానంలో (ఓపెన్ ఓటింగ్) ఉపసర్పంచ్‌ను ఎంపిక చేస్తారు. ఉపసర్పంచ్ పదవీకాలం ఐదేళ్లు.
News December 14, 2025
కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.
News December 14, 2025
నిర్మల్ జిల్లాలో 82.67 శాతం ఓటింగ్

నిర్మల్ జిల్లాలో రెండవ దఫా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 82.67 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దిలావర్పూర్ మండలంలో 82.63, కుంటాల 85.11, లోకేశ్వరం 85.32, నర్సాపూర్ జి 79.98, నిర్మల్ రూరల్ 81.53, సారంగాపూర్ ,81.69, సొన్ మండలంలో 82.58 శాతం ఓటింగ్ నమోదైనట్లు వారు పేర్కొన్నారు.


