News January 18, 2025
విజయవాడ: ఈ-లాటరీలో రిటర్నబుల్ ఫ్లాట్ల అందజేత
రాజధాని అమరావతికి భూమినిచ్చిన రైతులకు శుక్రవారం విజయవాడ CRDA కార్యాలయంలో రిటర్నబుల్ ప్లాట్లు అందజేశారు. ఈ మేరకు 39 మందికి ఈ- లాటరీ విధానంలో రాజధాని అమరావతిలో 72 ఫ్లాట్లు ఇచ్చామని కార్యక్రమం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవతేజ తెలిపారు. రిటర్నబుల్ ఫ్లాట్లు పొందిన రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సౌకర్యవంతంగా జరిగేందుకు అమరావతిలో తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
Similar News
News January 18, 2025
కృష్ణా, NTR జిల్లాలపై చంద్రబాబు సంతృప్తి
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జుల మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురి మంత్రులను హెచ్చరించారు.
News January 18, 2025
కృష్ణా: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- చర్లపల్లి(CHZ) మధ్య శనివారం ప్రత్యేక రైలును అధికారులు నడుపుతున్నారు. ఈ మేరకు రైలు నం.08549 VSKP- CHZ రైలును శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లలో 4 జనరల్ కోచ్‌లు, 9 స్లీపర్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 2.55 కి విజయవాడ, రాత్రి 9 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని వివరించారు.
News January 18, 2025
కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు- 2024లో నిర్వహించిన ఫార్మ్-డీ కోర్సు 1, 4వ ఏడాది రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.