News June 11, 2024
విజయవాడ: గవర్నర్ను కలిసిన కూటమి నేతలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News November 28, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని విద్యార్థులను కోరింది.
News November 28, 2024
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో జ్యోతిరావు పూలే వర్ధంతి
మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు.
News November 28, 2024
కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.