News September 14, 2024
విజయవాడ: ధనుష్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది

ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘3’ (2012) సినిమా సెప్టెంబర్ 14న రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు విజయవాడలోని నాలుగు థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి”తో పాటు ఇతర పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో విజయవాడలో ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి.
Similar News
News December 30, 2025
EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండాలి: కలెక్టర్

EVM గోదాము వద్ద భద్రత మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉన్న EVM నిల్వ కేంద్రాన్ని త్రైమాసిక తనిఖీ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో కలెక్టర్‌తో పాటు పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలన్నారు.
News December 29, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.