News February 25, 2025
విజయవాడ : నేడు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ పై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది.
Similar News
News February 25, 2025
హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.
News February 25, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 25, 2025
మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్‌గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్‌గా నిలుస్తారేమో చూడాలి.