News February 14, 2025

విజయవాడ: పోలీసులు కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. నగర పరిధిలో ఎక్కవ మంది గుమికూడవద్దన్నారు. కర్రలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకొని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 15, 2025

MBNR: PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఈనెల 17న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు.

News December 15, 2025

T20 సిరీస్‌ నుంచి అక్షర్ పటేల్ ఔట్

image

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచులకు ఆయన అందుబాటులో ఉండరని తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. 5 మ్యాచుల T20 సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచులు జరగగా IND 2, SA 1 గెలిచాయి. ఈ నెల 17న 4th, 19న 5th టీ20 జరగనుంది.

News December 15, 2025

‘తీరప్రాంత రైతులకు వరం.. సముద్రపు పాచి సాగు’

image

సముద్ర తీర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, రైతుల జీవనోపాధికి సముద్రపు పాచి, ఆస్పరాగస్‌ సాగు ఎంతో కీలకమని కలెక్టర్‌ మహేశ్ కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీటి సాగుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమీక్షించారు. లవణ భరిత నేలల్లో పెరిగే హలో ఫైటు రకానికి చెందిన సముద్ర ఆస్పరాగస్‌ ఉప్పునీటి నేలల్లో సులభంగా పెరుగుతుందన్నారు. దీంతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.