News February 2, 2025

విజయవాడ: ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బనారస్(BSBS) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న MAS- BSBS(నం.06193), 12న BSBS- MAS (నం.06194) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలులో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 12, 2025

భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 12, 2025

పోసాని విడుదలకు బ్రేక్!

image

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. సిద్దిపేట జిల్లాకు ఇవి కావాలి..?

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరి సిద్దిపేటకు నిధులు కేటాయిస్తారా.. చూడాలి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టూరిజం స్పాట్ శిల్పారామం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద బీచ్, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, పశువుల వైద్య కాలేజీల్లో పెండింగ్‌‌ పనులతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగనాయక సాగర్ డ్యాం వద్ద ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. యువతకు ఉపాధి కల్పించాలి.  

error: Content is protected !!