News February 19, 2025
విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్‌కు స్పెషల్ రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్(CHE), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. ఈ మేరకు నం.07025 CHZ-CHE రైలును ఫిబ్రవరి 21న, నం.07026 CHE-CHZ రైలును ఫిబ్రవరి 22న నడుపుతున్నామంది. ఈ రైళ్లు ఏపీలోని విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని తాజాగా ఓ ప్రకటనలో SCR పేర్కొంది.
Similar News
News February 22, 2025
ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

1847-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం (కుడివైపు ఫొటో)
1866: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య జననం (ఎడమవైపు ఫొటో)
1944: కస్తూర్బా గాంధీ మరణం
1958: భారత తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం
1966: సినీ దర్శకుడు తేజ జననం
1983: దివంగత నటుడు నందమూరి తారకరత్న జననం
2019: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం
News February 22, 2025
హుస్నాబాద్: రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన ప్రభుత్వ కళాశాల ప్రాజెక్టులు

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక అయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థుల నైపుణ్యతను అభినందించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను పరిశోధన రంగంవైపు మళ్లించేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు.
News February 22, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు MP

చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో రహదారులు నెత్తురోడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నారు.