News July 4, 2024

విజయవాడ- విజయనగరానికి RTC సూపర్ లగ్జరీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విజయనగరానికి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని RTC విజ్ఞప్తి చేసింది.

Similar News

News November 27, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఆగస్టు 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 2లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది. 

News November 27, 2024

కృష్ణా: ధాన్యం విక్రయాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ 

image

జిల్లాలో ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా 8247693551 నంబర్‌కి ఫోన్ చేసి తెలియపర్చవచ్చన్నారు. 

News November 27, 2024

కొనకళ్ల కోడలి చీర మిస్సింగ్‌.. నోటీసుల జారీ

image

మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడారు. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్‌, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.