News March 18, 2025
విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.
Similar News
News March 18, 2025
‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.
News March 18, 2025
WGL: తగ్గిన మొక్కజొన్న.. పెరిగిన పల్లికాయ!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర మళ్లీ తగ్గింది. గతవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. సోమవారం రూ.2,280కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గి రూ. 2270 కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.7,150 పలకగా నేడు రూ.7,390కి పెరిగింది. పచ్చి పల్లికాయ సోమవారం రూ.4,400 ధర రాగా ఈరోజు రూ.4,500కి పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
News March 18, 2025
సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.