News April 6, 2025
విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే.!

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.310 ఉండగా నేడు రూ.270గా ఉంది. అలాగే స్కిన్ రూ.260లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీకి రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.
Similar News
News April 9, 2025
వేములవాడ: క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది. వేములవాడలోని కోరుట్ల బస్‌స్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి(11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని కరీంనగర్ అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
News April 9, 2025
కొత్తగూడెం: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ వివరాలిలా.. మండలంలోని జెడ్ వీరభద్రపురానికి చెందిన కొమరం రాముడు గతనెల11న అదృశ్యంకాగా, మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమైంది. చేతబడి వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుడి బంధువులు వెంకటేశ్వరావు, పద్దం బాలరాజు రాముడిపై పగ పెంచుకొని హత్య చేసి, చెరువులో పడేశారని సీఐ చెప్పారు.
News April 9, 2025
గద్వాల: శతాధిక వృద్ధురాలు మృతి

గట్టు మండలం ఆరగిద్దకి చెందిన శతాధిక వృద్ధురాలు పటేల్ గంగమ్మ (110) మంగళవారం సాయంత్రం చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. గంగమ్మకు ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. వృద్ధురాలు మరణించడం పట్ల గ్రామస్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.