News May 7, 2024
విజయవాడలో రెడ్ జోన్ అమలు
ప్రధాని మోదీ బుధవారం విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ రోజు మోదీ పర్యటించే 2 కి.మీ పరిధిలో రెడ్ జోన్(నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఆ రోజు పీవీఆర్ మాల్ వద్దకు ప్రధాని రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు(1.3కి.మీ) రోడ్ షో నిర్వహిస్తారు. 5 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
Similar News
News December 27, 2024
కృష్ణా: MBA పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.
News December 27, 2024
రేపటి నుంచి సౌత్ జోన్ ఆక్వాటిక్ టోర్నీ
ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్ గురువారం తెలిపారు. సౌత్ జోన్ పరిధిలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది స్విమ్మర్లు పాల్గొంటారని అయన పేర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
News December 26, 2024
కృష్ణా: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కృష్ణా (D), నాగాయలంకకు చెందిన పృథ్వీరాజ్ RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లై పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.