News April 18, 2025

విజయవాడలో రేపు జాబ్ మేళా

image

NTR వికాస సౌజన్యంతో శనివారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగమేళా జరగనుంది. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పాసైన 18- 35 ఏళ్లలోపు వయసున్నవారు ఈ ఉద్యోగమేళాకు హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, టెక్నీషియన్, టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఆసక్తి కలవారు హాజరు కావాలని సూచించారు.

Similar News

News April 20, 2025

కాబోయే భర్తకు ఉండాల్సిన 18 లక్షణాలు.. యువతి పోస్ట్ వైరల్

image

తనకు కాబోయే భర్తకు 18 లక్షణాలు ఉండాలంటూ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పోస్ట్ చేసింది. ‘నాపై డీప్ లవ్, రూ.2.5 కోట్ల జీతం, లగ్జరీ లైఫ్, ఉదార స్వభావం, తెలివైన, ధైర్యం, విలువలు, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, సామాజిక గౌరవం, ఫ్యామిలీ పర్సన్, నా లైఫ్‌స్టైల్‌కు సపోర్ట్, ట్రావెలింగ్, ప్రైవసీకి ప్రాధాన్యం, లైంగిక క్రమశిక్షణ, గర్భనిరోధక చర్యలు, ఈజీ లైఫ్ లీడ్ చేయించే వాడు’ తనకు భర్తగా కావాలని రాసుకొచ్చింది. మీ COMMENT?

News April 20, 2025

DSC: కర్నూలు జిల్లాలో పోస్టులు ఇలా..

image

కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను <<16155948>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 82
➤ హిందీ:114 ➤ ఇంగ్లీష్: 81
➤ గణితం: 90 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 74 ➤ సోషల్: 112
➤ పీఈటీ: 209 ➤ఎస్జీటీ: 1,817 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, జీవశాస్త్రం 4, సోషల్ 2, పీఈటీ 2, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

News April 20, 2025

మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

image

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.

error: Content is protected !!