News April 18, 2025
విజయవాడలో శవమై తేలిన భూపాలపల్లి మహిళ

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహిళ విజయవాడలో శవమై తేలింది. KU ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. భావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన స్రవంతి కుటుంబంతో కొంత కాలంగా HNK భీమారంలో ఉంటోంది. అయితే పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత రెండు నెలల క్రితం ఆమెకు బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈనెల 15న ఇంట్లోంచి వెళ్లిపోయన స్రవంతి గురువారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ(ఏపీ) వద్ద శవమై తేలింది.
Similar News
News December 26, 2025
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జాజుల

నల్గొండ జిల్లాలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం కల్పించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని, నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
News December 26, 2025
సాత్విక పొలిటికల్ ఎంట్రీ.. కోమటిరెడ్డి ఆశీర్వాదం

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దుబ్బ సాత్విక గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు తెలపాలని కోరుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా సాత్విక పేర్కొన్నారు.
News December 26, 2025
విజేతగా నిలిచిన భూపాలపల్లి జట్టు

HCA, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ లీగ్ పోటీల ఫైనల్ మ్యాచ్‌లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలవగా, హనుమకొండ రన్నరప్‌గా నిలిచింది. ఉత్తమ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన క్రీడాకారులను క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.


