News February 18, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 21, 2025

వివిధ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఓయూలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహబిలిటేషన్ సైకాలజీ కోర్సుల మొదటి సెమిస్టర్, పీఎస్వై క్లినికల్ సైకాలజీ మొదటి సంవత్సరం, ప్రొఫెషనల్ డిప్లమా ఇన్ క్లినికల్ సైకాలజీ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.

News February 21, 2025

కీసర గుట్ట జాతర.. CM రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

News February 21, 2025

శుక్రవారం: HYDలో మళ్లీ తగ్గిన చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం KG స్కిన్‌లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా KG మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ.168, KG విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ఎంత?

error: Content is protected !!