News March 22, 2025
విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు

ఇతర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చదవాలని అనుకునే వారి కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు శౌర్య కన్సల్టెన్సీ తెలిపింది. ఇందుకోసం JNTU బ్రాంచీలో ఈ నెల 22, 23 తేదీల్లో యూనివర్సిటీ, బ్యాంకు అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటించింది. విద్యార్థులు ఎవాల్యుయేషన్, స్కాలర్‌షిప్ గైడెన్స్, ఇతర వివరాల కోసం ఆయా తేదీల్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 24, 2025
హైటెక్‌సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

టీ, స్నాక్స్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్‌సిటీలో నూతన బ్రాంచ్‌ను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్‌లెట్‌ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్‌తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.