News April 23, 2025

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: ADB SP

image

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.

Similar News

News April 23, 2025

ఆ కేసును కొట్టేయండి.. కోర్టులో సీఎం రేవంత్ పిటిషన్

image

TG: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ CM రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. BJP మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టొద్దని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రేవంత్ కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

News April 23, 2025

బైసరన్ లోయ ఎంచుకోవడానికి కారణం ఇవేనా?

image

పహల్‌గామ్‌లోని బైసరన్ లోయను ఉగ్రవాదులు నరమేధానికి ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని భద్రతా అధికారులు చెబుతున్నారు.
1. ఇక్కడి పచ్చదనం పాడవ్వకూడదని పహల్‌గామ్- బైసరన్ వరకు 5KM మోటార్ వాహనాలను అనుమతించరు.
2. కాలినడక లేదా గుర్రాల ద్వారానే చేరుకోవాలి.
3. దాడులకు పాల్పడినా ప్రతిచర్యలకు ఆలస్యం అవుతుంది.
4. లోయకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల సులభంగా చొరబడి దాడి చేసి తప్పించుకోవడానికి వీలుంటుంది.

News April 23, 2025

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత: ఖమ్మం కలెక్టర్

image

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మధిర మండలం దెందుకూరులో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనల్లో మార్పు వస్తే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.

error: Content is protected !!