News September 21, 2024
విద్యార్థుల మంచి మనసు.. నంద్యాల కలెక్టర్‌కు విరాళం అందజేత
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు దాచుకున్న రూ.11,675 చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.
Similar News
News November 11, 2024
కర్నూలు: 1988-1993 పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనం
తుగ్గలి మండలం పెండేకల్ (ఆర్.ఎస్.) జెడ్.పి.హెచ్.యస్ లో 1988-1993 వరకు చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. గురువుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తమతో పాటు విద్యను అభ్యసించి మృతి చెందిన 9 మంది విద్యార్థులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. పాఠశాలకు ప్రింటింగ్ ప్రెస్ జిరాక్స్ మిషన్‌ను బహుకరించారు.
News November 11, 2024
కర్నూలు జిల్లాలో TODAY TOP NEWS
* నందవరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
* శ్రీశైలంలో డ్రోన్ కలకలం.. ఆలయ సిబ్బంది అదుపులో యువకులు
* ఆదోనిలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు
* ఎమ్మిగనూరు: గుండెపోటుతో యువకుడు మృతి
* ఎమ్మిగనూరులో ఈ నెల12న జాబ్ మేళా
* నంద్యాల: రేపు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్ రాజకుమారి గణియా
* కర్నూలు: టీడీపీ యాదవులకు తీరని అన్యాయం చేసింది: అయ్యన్న యాదవ్
News November 10, 2024
వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది: ఎంపీ
వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఎంపీ నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూలులో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఎంఈఓ, హెచ్ఎంలను సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీఈవో శామ్యూల్ పాల్, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.