News February 8, 2025

విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

image

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.

Similar News

News February 9, 2025

బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

image

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.

News February 9, 2025

నిర్మల్: గురుకుల విద్యార్థినిని అభినందించిన ప్రధాని

image

సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎస్ వర్షితకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సెప్టెంబర్ మాసంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రయోగాత్మక నైపుణ్య అభివృద్ధి భారత నిర్మాణంలో 5 మౌలిక సూత్రాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చినందుకుగాను ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురుకుల విద్యార్థి హర్షితకు హర్షితకు లేఖ పంపారు.

News February 9, 2025

కుంటాల గ్రామంలో సగానికి పైనే అమ్మవారి పేర్లు

image

కుంటాలలో సుమారు నాలుగువేల పైచిలుకు జనాభా ఉంది. తమ కోరికలు తీరుతుండటంతో ఊరిలో సగం మంది తమ పిల్లలకు అమ్మవారి పేరు పెట్టుకుంటున్నారు. ఇంట్లో పాప జన్మిస్తే గజ్జలమ్మ, గజ్జవ్వ బాబు జన్మిస్తే గజ్జయ్య, గజేందర్ గజ్జరామ్ అని నామకరణం చేస్తారు. కాగా సంతానం కలగకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న, వ్యాపారంలో కలిసి రాకపోయినా, వ్యవసాయంలో నష్టాలు వచ్చిన, గజ్జలమ్మ దేవికి మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతుందని భక్తుల నమ్మకం.

error: Content is protected !!