News February 3, 2025
విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళిక: కలెక్టర్
పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు.
Similar News
News February 4, 2025
గీసుగొండ సీఐ హెచ్చరిక
సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 3, 2025
వరంగల్ విద్యార్థికి ప్రపంచ రికార్డులో చోటు
వరంగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న ఇమ్మడి అభిరామ్‌కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. స్కూల్లో సీనియర్ విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవంలో అభిరామ్ మహాభారతంలోని కర్ణుడి వేషాధరణలో 5 నిమిషాల 30 సెకన్ల పాటు అనర్గళంగా ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. ఈ ఏకపాత్రాభినయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకొని సూపర్ టాలెంట్ కిడ్ అవార్డుకు ఎంపిక చేశారు.
News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి
ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.