News March 20, 2025

విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.

Similar News

News March 28, 2025

రామడుగు: శుక్రవారం సభ పరిష్కారాల వేదిక: కలెక్టర్

image

శుక్రవారం సభ ఒక పరిష్కారం లాంటిదని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. శుక్రవారం రామడుగు మండలంలోని కొక్కేరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా పలు సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

News March 28, 2025

బాలానగర్ : నర్సింగ్ విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మండల కేంద్రానికి చెందిన మణిదీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణంపై ఎవరిపైన అనుమానం లేదని, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.

News March 28, 2025

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగ డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

image

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉగాది డైరీ పంచాంగాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు సంజయ్, ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి నరేందర్, సీనియర్ ఉపాధ్యక్షులు సంజయ్ పాల్గొన్నారు.

error: Content is protected !!