News February 17, 2025
విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
Similar News
News February 21, 2025
ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.
News February 21, 2025
GNT: బాలికల మిస్సింగ్.. గుర్తించిన పోలీసులు

గన్నవరంకు చెందిన 4 మైనర్ విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. కాలేజ్‌కి వెళ్లకుండా షాపింగ్ మాల్‌కి వెళ్లడంతో మందలించారు. దీంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. వెంటనే తల్లిదండ్రులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్లలో ఉన్నట్లు గుర్తించి ఇక్కడి పోలీసులకు సమాచామిచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. VJA, GNT మీదుగా ట్రైన్‌లో వస్తుండగా గుర్తించారు.
News February 21, 2025
గుంటూరు: లాడ్జిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

సోదరి మృతిని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొత్తపేట స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన రవితేజ (32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని సోదరి కోవిడ్ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.