News January 21, 2025
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన పీయూ వీసీ
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానాను మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య డీ.చెన్నప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల నియామకం, కొత్త కోర్సుల రూపకల్పన, మొదలైన అంశాల గురించి చర్చించారు.
Similar News
News January 22, 2025
MBNR: తొలిరోజు రేషన్ కార్డులకే అధికం
ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రామ, వార్డు సభలకు దరఖాస్తుదారులు పోటెత్తారు. 4 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జాబితాతో పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీయడం, అధికారులు సముదాయించడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలిరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు MBNRలో 6096, NGKLలో 2826, వనపర్తిలో 4749 అప్లికేషన్లు రాగా, గద్వాలలో మొత్తం 7539, NRPTలో 3073 దరఖాస్తులు వచ్చాయి.
News January 22, 2025
నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 23వ తేదీన బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. 18 -35 సంవత్సరాల వయసు ఉండి విద్యార్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు హైదరాబాద్, కర్నూల్, గద్వాలలోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కలుగుతుందని ఆమె తెలియజేశారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 21, 2025
అధైర్య పడవద్దు.. అందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్
ఎవరు అధైర్య పడకూడదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి, అర్హులకు పథకాలు వర్తింప చేస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.