News March 4, 2025

విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: వరుణ్ రెడ్డి

image

హన్మకొండలోని NPDCL కార్యాలయంలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి , ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం కావున విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్లు సామర్థ్యం పెంపుదల చేయాలని తెలిపారు.

Similar News

News March 4, 2025

నవరత్న కంపెనీలుగా IRCTC, IRFC

image

ప్రభుత్వ రంగ సంస్థలైన IRCTC, IRFCలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం కంపెనీలకు ఈ హోదా ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి IRCTC రూ.4270 కోట్ల వార్షిక ఆదాయం, IRFC రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. తాజాగా రెండు కంపెనీలు చేరడంతో ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకుంది.

News March 4, 2025

దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!