News February 1, 2025
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
కర్నూలు(D) గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గోనెగండ్ల గ్రామానికి చెందిన బోయ రంగస్వామి (46) ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
Similar News
News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
News February 1, 2025
నిర్మలమ్మ పద్దుపై కర్నూలు ప్రజల ఆశలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కర్నూలు జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కర్నూలు-మంత్రాలయం కొత్త లైన్, కర్నూలు నుంచి అమరావతికి నేరుగా రైలు సౌకర్యం, రిహాబిలిటేషన్ వర్క్‌షాపు పూర్తి కోసం నిధుల కేటాయింపుపై ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. ఇక ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రైల్వే లైన్‌పై ప్రకటన ఉంటుందో? లేదో? వేచి చూడాలి.
News February 1, 2025
‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు’
గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ శాఖల సెక్రటరీ సూర్య కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు సునయన ఆడిటోరియంలో వివిధ ఐసీడీఎస్ అంశాల అమలుపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.