News April 3, 2024
విధుల నుంచి నెల్లూరు ఎస్పీ రిలీవ్
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులు అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి బదిలీ అయ్యారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు బాధ్యతలు అప్పగించి తిరుమలేశ్వర రెడ్డి తన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. తిరుమలేశ్వరరెడ్డి గతేడాది ఏప్రిల్ 12న బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News January 10, 2025
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 10 లక్షల సాయం
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.
News January 10, 2025
ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం.. 10th Class విద్యార్థి మృతి
ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. బైక్‌పై ఆత్మకూరుకు వెళ్తున్న జశ్వంత్‌ను అప్పారావుపాలెం నుంచి ఇసుకలోడుతో ఆత్మకూరుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలంలోనే జశ్వంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
News January 9, 2025
రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్
రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు.