News March 5, 2025
విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: హనుమకొండ DMHO

హనుమకొండ జిల్లాలోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్‌ను DMHO అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను.. సద్వినియోగ చేసుకొని రోగులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విధులలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News March 5, 2025
నాపై కేసులను కొట్టేయండి.. హైకోర్టులో పోసాని పిటిషన్లు

AP: తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ, ఆదోనిలో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా నేను వ్యాఖ్యలు చేయనందున BNS సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చెల్లదు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారు. 41A కింద నోటీసు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకోవాలి’ అని కోరారు.
News March 5, 2025
సిద్దిపేట: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇంటిలో మహిళలను తెచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ మహిళ, రూ.1700 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.