News February 18, 2025
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
Similar News
News March 12, 2025
కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డిబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,499 మంది పరీక్షకు హాజరు కాగా 401 విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. మద్దికేరలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చెప్పారు.
News March 12, 2025
పోసాని నేడు విడుదలయ్యేనా?

కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు కర్నూలు JFCM కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జైలు నుంచి విడుదలయ్యేలోపు ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం నడుస్తోంది. కాగా ఈ నెల 4 నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.
News March 12, 2025
ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్ర్భాంతి

ఆదోని మండలం పాండవగల్లు <<15730038>>వద్ద<<>> జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించడంపై CM చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని టీడీపీ కార్యకర్తలు ఈరన్న, ఆదిలక్ష్మి దంపతులతో పాటు ముగ్గురు కర్ణాటక వాసులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులను వాకబు చేశారు. మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.