News January 10, 2025

వినియోగదారులు అపోహలు విడాలి: ప్రకాశం ఎస్.ఈ

image

విద్యుత్ వినియోగదారుల పిఎం సూర్య ఘర్ యోజన పై అనుమానాలు వీడాలని ప్రకాశం జిల్లా ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుందని, సబ్సిడీ బ్యాంకు లోన్ కూడా లభిస్తుందని వెల్లడించారు. తమ సిబ్బంది వినిగిదారులని కలుస్తారని తెలిపారు.

Similar News

News January 10, 2025

ఒంగోలు: నేటితో ముగియనున్న పరీక్షలు

image

ఒంగోలులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. 552 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 365 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని ఎస్సీ ఆర్.దామోదర్ వెల్లడించారు. అభ్యర్థులకు శుక్రవారంతో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు.

News January 10, 2025

ప్రకాశం: విద్యార్థినులపై లైంగిక వేధింపులు

image

తమను ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌ వేధిస్తున్నాడని విద్యార్థినులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఉంది. అందులో పనిచేసే ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. తనకు సహకరించకపోతే మార్కులు తక్కువ వేస్తానంటూ తమను బెదిరిస్తున్నారన్నారు.

News January 10, 2025

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

image

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రెవిన్యూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.