News February 12, 2025
వినుకొండ: గుర్తు తెలియని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368748806_1286-normal-WIFI.webp)
వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో అంబేడ్కర్ నగర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని తెలిపారు.
Similar News
News February 13, 2025
సంగారెడ్డి: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372406156_50339027-normal-WIFI.webp)
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.
News February 13, 2025
ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366423064_60332653-normal-WIFI.webp)
ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.
News February 13, 2025
KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373102544_50093551-normal-WIFI.webp)
నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.