News August 1, 2024
వినుకొండ: రషీద్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలిసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. జులై 17న పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో YCP కార్యకర్త రషీద్‌ను జిలాని అనే యువకుడు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో నరికి హత్యచేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు. బుధవారం మరో ముగ్గురుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు CI సాంబశివరావు తెలిపారు.
Similar News
News November 29, 2024
రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
News November 29, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.
News November 29, 2024
నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.