News November 12, 2024
‘విప్’లుగా గణబాబు, వేపాడ చిరంజీవి
శాసనసభ విప్‌గా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. 2017 నుంచి 2019 వరకు విప్‌గా పనిచేశారు. వేపాడ చిరంజీవి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో గెలుపొందారు.
Similar News
News November 14, 2024
టాస్క్‌ఫోర్స్ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్‌ఫోర్స్ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్‌సెల్ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది.
News November 14, 2024
విశాఖలో కబ్జాలను ఆధారాలతో నిరూపిస్తా: బండారు
విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో ప్రస్తావించారు. సుమారు రూ.3వేల కోట్లు విలువ చేసే 300 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో ప్రజలను భయపెట్టి లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి హస్తం ఇందులో ఉందని తనకు అవకాశం ఇస్తే పూర్తి ఆధారాలతో నిరూపిస్తా అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలని బండారు కోరారు.
News November 14, 2024
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు భోగిలు
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463/64), భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ (22879 /80)నకు రెండు థర్డ్ ఏసీ భోగిలు, అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-దిఘా, గాంధిగామ్ సూపర్ ఫాస్ట్‌లకు అదనపు భోగిలు జత చేశామని తెలిపారు.