News March 30, 2025

విశాఖ: 9 మంది పోలీస్ సిబ్బందికి వీడ్కోలు పలికిన సీపీ

image

విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన 9 మంది పోలీస్ సిబ్బంది శనివారం పదవీ విరమణ చేశారు. వారికి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారిలో ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సి, ఎఆర్‌హెచ్‌సీ, పీసీలు ఉన్నారు.

Similar News

News April 2, 2025

విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

image

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 2, 2025

మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్‌లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2025

ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

image

పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ కాలనీల గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందించి, నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

error: Content is protected !!