News January 28, 2025
విశాఖ: ‘అందుబాటు ధరల్లో స్థలాలు’

ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్”లో స్థలాలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయని వి.ఎం.ఆర్.డి.ఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖ జిల్లా రామవరం, పాలవలస, గంగసాని అగ్రహారం, అనకాపల్లి జిల్లా అడ్డూరు, విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతాలలో అన్ని మౌలిక వసతులతో లభ్యమవుతున్నాయన్నారు. అనాధికారిక లేఔట్లలో స్థలాలు కొని మోసపోవద్దని సూచించారు.
Similar News
News March 14, 2025
విశాఖలోని 13 రైతు బజార్లో నేటి కాయగూరల ధరలు

విశాఖ 13 రైతు బజార్లో శుక్రవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ 38,మిర్చి రూ.26, బెండ రూ.44, బీరకాయలు రూ.50, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.36/40, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, కాకరకాయ రూ.42,పొటల్స్ రూ.90, దోసకాయలు రూ.28గా నిర్ణయించారు.
News March 14, 2025
విశాఖ నుంచి షాలిమార్, చర్లపల్లికి ప్రత్యేక రైళ్ళు

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి షాలిమార్(08577/78), చర్లపల్లికి(08579/80) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16 తేదీన బయలుదేరి మార్చి 17న తిరుగు ప్రయాణంలో విశాఖ చేరుతాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News March 14, 2025
విశాఖ: మోసం చేసిన ఏడుగురికి ఐదేళ్ల జైలు

పెందుర్తిలో 2017 FEBలో 158.66 చదరపు గజాల ప్లాట్‌ను ఓ వ్యక్తికి రూ.18లక్షలకు విక్రయించారు. తరువాత అమ్మకందారుడు మరికొందరితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్‌ను వేరొకరికి కూడా విక్రయించారు. దీంతో బాధితుడు కేసు పెట్టాడు. విచారించిన జిల్లా ఎస్.సి&ఎస్.టి కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురికి 5 ఏళ్ల జైలు, ఒక్కొక్కరూ రూ.2,90,000 చొప్పున బాధితునికి నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.