News December 23, 2024
విశాఖ: ‘అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష’
ఉపాధి హామీ పథకం, అమృత్ పథకం, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ 20 సూత్రాల ఛైర్మన్ ఎల్.దినకర్ తెలిపారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల అనంతరం నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పాల్గొన్నారు.
Similar News
News December 24, 2024
పెదబయలు: ఏ-2 నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
2014లో పెదబయలు మండలంలోని కుంతుర్ల గ్రామానికి చెందిన మజ్జి బాలరాజు అనే వ్యక్తి, అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందాడని ఎస్సై కే.రమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిలో ఏ-2 ముద్దాయి అయిన గంపదొర సత్తిబాబు అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
News December 23, 2024
విశాఖ-అరకు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి అరకు 11.45 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఇవే తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరతాయని తెలిపారు.
News December 23, 2024
నర్సీపట్నం: ఇతనే ఆర్టీసీ హైర్ బస్సు దొంగ
నర్సీపట్నం ఆర్టీసీ హైర్ బస్సు దొంగతనంలో నిందితుడు సాదిక్ భాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాకు చెందిన భాషా గతంలో వోల్వో, లారీలకు డ్రైవర్గా పనిచేశాడు. ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి వచ్చి మద్యం మత్తులో బస్సులో పడుకున్న తర్వాత బస్సుకు తాళం ఉండటం గమనించి దొంగతనం చేశాడని తెలిపారు.