News July 9, 2024
విశాఖ-అరకు రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!
విశాఖ-అరకు జాతీయ రహదారి విస్తరణకు త్వరలో మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. గత ఏడాది విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ కేంద్రం ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.కొత్తవలస, ఎల్ కోట, వేపాడ, ఎస్ కోట మీదుగా 4 లైన్లకు విస్తరించనున్నారు.
Similar News
News November 26, 2024
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.
News November 26, 2024
IPL వేలంలో విజయనగరం కుర్రాడికి చుక్కెదురు
ఐపీఎల్ మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్లో రాణిస్తున్నాడు. అయితే వేలంలో అతనికి చుక్కెదురయ్యింది. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో విజయనగరం వాసులు, అభిమానులు నిరాశ చెందారు.
News November 26, 2024
గత ఐదేళ్లు జీసీసీ పూర్తిగా నిర్వీర్యం:కిడారి
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం జీసిసిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని దీని బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విజయనగరంలో సబ్బుల తయారీ యూనిట్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రైవేటు సరుకులు మాదిరిగా డిసిసి సరుకులు జనాలను ఆకర్షించే విధంగా నాణ్యతతో తయారు చేస్తామని చెప్పారు.