News July 19, 2024
విశాఖ: అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వారిపై నిఘా
పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. పెదగంట్యాడకు చెందిన యువతిపై హత్యాయత్నం విషయమై ఆయన మాట్లాడుతూ.. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను వేధించినా, ఇబ్బందులకు గురి చేసినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2024
విశాఖ: తొలి రోజు 233 మంది హాజరు
పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖ అభ్యర్థులకు సోమవారం నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసగిరి పోలీస్ మైదానంలో ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 233 మంది మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు.
News December 30, 2024
పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it
News December 30, 2024
హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు
అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.