News January 10, 2025

విశాఖ: ఈనెల 18న జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈఓ పి.నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ మేరకు జడ్పిటిసి సభ్యులు ఎంపీపీలకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. అధికారులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News February 5, 2025

రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే..

image

రాయగడ డివిజన్ పరిధిలో <<15366937>>రైల్వే లైన్లు<<>> రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్ రైల్వే‌స్టేషన్‌ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.

News February 5, 2025

KGHలో రౌడీషీటర్ హల్‌చల్

image

విశాఖ కేజీహెచ్‌లో రౌడీషీటర్ బుధవారం హల్‌చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్‌లైన్‌ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

News February 5, 2025

గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు. 

error: Content is protected !!