News March 29, 2025
విశాఖ: ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.
Similar News
News April 2, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి బి.పెంటయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్టీల్ ప్లాంట్ SMS-2 విభాగంలో గతనెల 14న మంటలు చెలరేగడంతో ఉద్యోగి బి.పెంటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News April 2, 2025
పెదగంట్యాడలో అమ్మాయి ఆత్మహత్య

పెదగంట్యాడ మండలానికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. విశాఖలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్‌లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.
News April 2, 2025
విశాఖ: టీచర్ల సమస్యలపై ప్రభుత్వ విప్‌కు వినతి

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావుని మంగళవారం ఏపీటీఎఫ్ యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయంలో సమావేశమైన యూనియన్ నాయకులు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.