News April 21, 2025

విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. నిర్వాహకుల అరెస్ట్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప.గో జిల్లా పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను ఆదివారం పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీవేద వివరాల మేరకు.. HYD, విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 10 ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని.. వీరిలో ఒకరు వైసీపీ నేత అని చెప్పారు.

Similar News

News April 21, 2025

V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్ 

image

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 21, 2025

ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

image

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. జనవరిలో నిర్వహించిన రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

error: Content is protected !!