News March 7, 2025

విశాఖ: గీత కార్మికులకు 14 మద్యం దుకాణాలు కేటాయింపు

image

విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించారు. ఉడా చిల్డ్రన్ ఏరినాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో 14 మందికి మద్యం దుకాణాలను కేటాయించారు. వారిలో జీవీఎంసీ లిమిట్స్‌లో 11 మందికి, భీమిలి పరిధిలో ఒకరికి, పద్మనాభం పరిధిలో ఒకరికి, ఆనందపురం పరిధిలో ఒకరికి కేటాయించారు. జిల్లాలో 14 మద్యం దుకాణాలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News March 7, 2025

విశాఖ: నేటి నుంచి ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం

image

నేటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ అధికారి మురళిదర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ మహిళ కాలేజీలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం చేయనున్నారు. వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 20వరకు ఉండనున్నాయి.

News March 7, 2025

విశాఖపట్నం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. విశాఖ ప్రజలు ఎక్కువగా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లిలో వివిధ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం వెళ్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా అనకాపల్లి వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ కామెంట్.

News March 7, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో సచివాలయం ఉద్యోగి మృతి

image

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!