News March 5, 2025
విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
Similar News
News March 6, 2025
హనుమంతవాక జంక్షన్లో యాక్సిడెంట్

హనుమంతవాక జంక్షన్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుస ఘటనలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 6, 2025
విశాఖ: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
News March 6, 2025
శ్రీకాకుళం వరకే విశాఖ-పలాస పాసింజర్

విశాఖ-పలాస రైల్వే లైన్లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. మార్చ్ 9 నుంచి మార్చ్ 16 వరకు(శుక్రవారం, ఆదివారం మినహాయించి) ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.