News July 10, 2024
విశాఖ జనాభా గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి
విశాఖ నగర జనాభా 23.85 లక్షలకు చేరింది. గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి సాధించింది. 2021లో విశాఖ జనాభా 22.26 లక్షలు ఉండగా, 2022లో 22.78 లక్షలు, 2023లో 23.31 లక్షలుగా నమోదయింది. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఏయూలోని పీ.ఆర్.సీ కేంద్రం సంచాలకులు ఆచార్య బీ.మునిస్వామి వివరాలను వెల్లడించారు. అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాగా.. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా విశాఖ నిలుస్తోంది.
Similar News
News December 30, 2024
పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it
News December 30, 2024
హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు
అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 30, 2024
కంచరపాలెం: ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా
కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ అధికారి చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో పలు కన్స్ట్రక్షన్, హెచ్డీబీ ఫైనాన్స్, మెడిప్లస్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. SSC, ఇంటర్, ఐటిఐ ఎలక్ట్రిషన్, డిగ్రీ డిప్లమో ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.