News March 30, 2024
విశాఖ జిల్లాలో ఆ ఒక్కటే మిగిలింది.!
ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 9, జనసేన 3, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అధినేత పవన్ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News January 10, 2025
‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏళ్ల జైలు.. ఇదీ కేసు!
యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’లో విశాఖ కలెక్టర్‌గా రామ్ చరణ్..!
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
News January 10, 2025
విశాఖ నుంచి పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు
సంక్రాంతి దృష్ట్యా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈ నెల 13 వరకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 20, రాజమండ్రి, విజయవాడకు 40, కాకినాడకు 20, విజయనగరం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 830 బస్సులు నడవనున్నాయన్నారు.