News February 27, 2025

విశాఖ జూలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు

image

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 28, 2025

సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలి: విశాఖ జేసీ

image

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా అందే సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో వారితో స‌మావేశ‌మైన ఆయ‌న వివిధ అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేష‌న్ బియ్యం పంపిణీ, తూనిక‌లు, కొల‌తలు ఇత‌ర ప్ర‌మాణాలు పాటించే క్ర‌మంలో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని చెప్పారు.

News February 28, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల సేవలపై ప్రశంసలు 
➤ ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు 
➤ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో 87.30 శాతం పోలింగ్ 
➤ KGHలో శిశువులు మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ 
➤ అప్పికొండ బీచ్‌లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌కు అస్వస్థత 
➤ కంచరపాలెంలో తల్లి మందలించిందని 9వ తరగతి విద్యార్థి మృతి

News February 27, 2025

హ్యాట్సాఫ్.. విశాఖ పోలీస్..!

image

మహా శివరాత్రి సందర్భంగా గురువారం విశాఖలో భక్తులు పెద్దఎత్తున సముద్ర స్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశాఖ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. పుణ్య స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి వెళ్లిపోయిన ఆరుగురిని గజ ఈతగాళ్ల సాయంతో రక్షించారు. జనసంద్రంలో తప్పిపోయిన 10 మంది చిన్నారులను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

error: Content is protected !!