News October 27, 2024
విశాఖ: ‘డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి’
డయేరియా పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆయన సాగర్ నగర్, బాలాజీ నగర్‌లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియా లక్షణాలు కనిపిస్తే సత్వర చికిత్స అందించాలన్నారు. సకాలంలో గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు.
Similar News
News January 3, 2025
పెందుర్తి: ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. దంపతుల సూసైడ్
పెందుర్తి మండలం పురుషోత్త పురంలో భార్యాభర్తలు ఉరివేసుకుని చనిపోయిన విషయం <<15043276>>తెలిసిందే<<>>. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. చీపురుపల్లికి చెందిన సంతోష్ (35) విశాఖకు చెందిన సంతోష్ శ్రీ (25) లవ్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవండంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 3, 2025
జనవరి 4న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే
విశాఖలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆర్‌కె బీచ్‌కు వెళ్లి నేవీ విన్యాసాలు తిలకిస్తారు. 6:15 నిముషాలకు ఆర్‌కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రోడ్డు మార్గన వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు.
News January 3, 2025
ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.