News January 21, 2025

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్

image

విశాఖ డీసీపీగా కృష్ణకాంత్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం  ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం మీద 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్, అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీశ్‌ను నియమించింది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేయడం గమనార్హం.

Similar News

News January 21, 2025

విశాఖ: అలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!

image

విశాఖలో DMHO కార్యాలయంలో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు మహిళల హక్కుల పరిరక్షణ, లింగ వివక్షపై అవగాహన నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్లో లింగ నిర్ధారణ చేయకూడదని, అలా చేస్తే మొదటిసారి రూ.10వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష, రెండో సారి లక్ష రూపాయల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష, నేరం నిరూపణ ఐతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.

News January 21, 2025

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌కు బదిలీ

image

జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సీడీఎంఏకు బదిలీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో జీవీఎంసీ కమిషనర్‌గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛార్జ్ తీసుకున్న కేవలం ఐదు నెలలలోపే ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ కేటాయించలేదు. 

News January 20, 2025

పాడేరు ఘాట్‌లో తప్పిన పెను ప్రమాదం

image

పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏసుప్రభు విగ్రహం మలుపు వద్ద రైలింగ్ ఢీ కొట్టి నిలిచిపోయింది. రైలింగ్ లేకపోతే పెద్ద లోయలో బస్సు పడేదని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కొంతసేపు బస్సు నిలిచింది. మలుపులో స్టీరింగ్ పట్టేయడంతో నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టింది.