News April 6, 2025
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి జిల్లాకు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 7, 2025
విశాఖ: పరీక్షకు విద్యార్థులు లేట్… వివరణ ఇచ్చిన పోలీసులు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు JEE పరీక్షకు హాజరవలేదనే విషయంపై విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో 7గంటలకు రిపోర్ట్ చేయాలని, 8:30 గంటలకు గేట్ మూసివేయనున్నట్లు హాల్ టికెట్‌లో ఉందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ రూట్‌లో 8:41గంటలకు వెళ్లారన్నారు. చినముషివాడలోని పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు గాను సర్వీస్ రోడ్‌లలో 8:30 వరకు ట్రాఫిక్ ఆపలేదని స్పష్టం చేశారు.
News April 7, 2025
విశాఖలో ఏసీబీ దాడులు

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్‌సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యడెండ్‌గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 7, 2025
విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.