News February 22, 2025
విశాఖ నుంచి శ్రీశైలంకు అదనంగా బస్సులు

శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సునకు అదనంగా బస్సులు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 25న విశాఖ నుంచి శ్రీశైలంకు మధ్యాహ్నం 2గంటలకు సూపర్ లగ్జరీ బస్సును సాధారణ బస్సు చార్జితో (రూ.1230/- లు) ద్వారకా బస్సు స్టేషన్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 23, 2025
విశాఖలో పగడ్బందీగా గ్రూప్-2 పరీక్ష: కలెక్టర్

విశాఖ జిల్లాలోని 16 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సెషన్స్‌లో 11,030 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 9,293 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,638 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2025
గాజువాకలో యువకుడు సూసైడ్?

గాజువాక సమీపంలో గల అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. విశాఖ డైరీ సర్వీస్ రోడ్డులోని శ్రావణి షిప్పింగ్ భవనం పక్కనే చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉంది. ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తున మృతుడు కర్రీ ప్రవీణ్(27)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 23, 2025
విశాఖ: యాక్సిడెంట్లో భర్త మృతి.. భార్యకు గాయాలు

ఆనందపురం మండలంలోని గిడిజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పొడుగుపాలెంకి చెందిన బంటుబిల్లి లక్ష్మణరావు(35), గౌరీ బైక్‌పై వేమగొట్టిపాలెం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా లక్ష్మణరావు మార్గమధ్యలో మృతి చెందాడు. అతని భార్య గౌరీకి రెండు కాళ్లు విరిగిపోయాయి.